telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పది నిమిషాల వ్యవధిలో పది జీవోల విడుదల!

jagan

ఏపీ సర్కార్ గత అర్ధరాత్రి పది నిమిషాల వ్యవధిలో పది జీవోలను రహస్యంగా విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. రాత్రి 11:45 గంటల నుంచి 11:55 మధ్య పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ జీవోలను విడుదల చేసింది. 50 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం అర్ధరాత్రి ఈ జీవోలను విడుదల చేయడం గమనార్హం.

59.85 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా ఆర్డినెన్స్ లేదంటే జీవోలలో ఏదో ఒకటి తెచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రహస్యంగా ఈ జీవోలను తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. మున్ముందు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో వీటిని విడుదల చేసినట్టు తెలుస్తోంది.

Related posts