telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సాహో” కోసం ఎదురుచూస్తున్నాను… నారా లోకేష్

Minister Lokesh comments YS Jagan

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆగష్టు 18న ‘సాహో’ గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినీ ప్రముఖులతో పాటు భారీస్థాయిలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ హాజరయ్యారు. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి.

తాజాగా ఈ సినిమాపై మాజీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానుల్లాగే తానూ “సాహో” చిత్రం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన “సాహో” బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. అంతేకాదు టీడీపీ కార్యకర్తలంతా సాహో సినిమా చూడాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి. ఇటీవల చెన్నైలో ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్ పనితీరును ప్రభాస్ మెచ్చుకున్నారు. రాజకీయాలు తనకు పెద్దగా తెలియదని, కానీ సీఎం జగన్ ఏపీని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని వెల్లడించారు. అయితే సీఎం జగన్‌ని ప్రభాస్ ప్రశంసించడాన్ని టీడీపీ వర్గాలు జీర్ణించుకోలేపోతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో “సాహో” సినిమాకు వ్యతిరేకంగా టీడీపీ నెగెటివ్ ప్రచారం చేస్తోందని ఓ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తలపై నారా లోకేష్ మండిపడుతూ ఇలా స్పందించారు.

Related posts