telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

ఏపీ ఉద్యోగులకు జూలై నెల జీతం ఆలస్యం!

notes hundered

ఏపీ ఉద్యోగులకు జూలై నెల జీతం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 5 తరువాతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే అవకాశం ఉంది. అలాగే 8 నాటికి పెన్షనర్లకు పెన్షన్లు అందనున్నాయి. గత నెలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ఖజానాలో నిలువ వెయ్యి కోట్ల రూపాయలే ఉండగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి 5వేల 500కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది.

ఉద్యోగుల జీతాలు 3వేల200 కోట్లు, పెన్షన్లర్లకు పెన్షన్లు 13 వందల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సోమవారం సెలవు కావడంతో మంగళ, బుధ వారాలలో బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం నిధులు సేకరించనుంది. నిధుల సెకారణ ఆధారంగా జీతాలు విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Related posts