telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బీఈడీ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌-2019 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, ఎడ్‌సెట్ ఛైర్మన్ రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. 96.75 శాతం మంది అర్హత సాధించారు. 18వ తేది నుంచి ర్యాంక్ కార్డులు డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని తెలిపారు. జూలై మొదటి వారంలో కౌన్సెలింగ్ జరగనుందని పేర్కొన్నారు.

ఈ ఫలితాల్లో మ్యాథ్స్‌లో పి.పల్లవికి మొదటి ర్యాంకు, ఫిజికల్‌ సైన్స్‌లో సాయిచంద్రికకు మొదటి ర్యాంకు, బయాలజీలో మణితేజకు మొదటి ర్యాంకు, ఆంగ్లంలో హరికుమార్‌కు మొదటి ర్యాంకు సాధించారు. 56 సెంటర్లలో ఎడ్‌సెట్ పరీక్షలు నిర్వహించారు. 14,019 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 11,650 మంది విద్యార్థులు ఎగ్జామ్‌కు హాజరయ్యారు. 11,490 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

Related posts