telugu navyamedia
ఆంధ్ర వార్తలు విద్యా వార్తలు

ఏపీఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదల..

ఏపీలో ఇటీవ‌ల నిర్వ‌హించిన ఎంసెట్ 2021 ఫ‌లితాలు విడుద‌లైయ్యాయి. మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు.

ఈ నెల చివ‌రి నుంచి కౌన్సిలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇంజ‌నీరింగ్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈ సారి 1000 మంది అద‌నంగా ఉత్తీర్ణ‌త సాధించారు. విద్యార్ధులు రేప‌టి నుంచి ర్యాంకు డౌన్‌లౌడ్ చేసుకోవ‌చ్చ‌ని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

ఇంజ‌నీరింగ్ విద్యార్ధుల్లో మొద‌టి ర్యాంకు అనంత‌పురం నుంచి నిఖిల్ , రెండ‌వ ర్యాంకు శ్రీకాకుళం నుంచి మ‌హంతి నాయుడు, మూడ‌వ ర్యాంకు వైఎస్ఆర్ జిల్లా వెంక‌ట త‌నీష్ , 4వ ర్యాంకు విజ‌య‌న‌గ‌రం నుంచి దివాక‌ర్ సాయి , ఇక నెల్లూరు నుంచి మౌర్య‌రెడ్డి 5వ ర్యాంకు సాధించిన‌ట్టుగా మంత్రి తెలిపారు.

మ‌రోవైపు ఏపీ ఎంసెట్‌ను ఈఏపీసెట్‌గా మార్చిన‌ట్లు తెలిపారు. ఇంజ‌నీరింగ్ త‌దిత‌ర కోర్సుల‌కు గ‌తంలో ఏపీ ఎంసెట్ పేరుతో నిర్వ‌హించేవారు. అయితే మెడిక‌ల్ కోర్సుల ప్రవేశాల‌కు జాతీయ స్థాయిలో నీట్ ను నిర్వ‌హిస్తున్నారు. దీంతో మెడిక‌ల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మిన‌హాయించారు. మెడిక‌ల్‌ను తొల‌గించ‌డంతో ఏపీ ఎంసెట్‌ను ఏపీ ఈఎపీసెట్ పేరుతో నిర్వ‌హించారు. ఏపీ ఈఎపీ సెట్ అంటే ఇంజ‌నీరింగ్, ఆగ్రిక‌ల్చ‌ర్, పార్మ‌సీ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ అని అర్థం.

ఆంద్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ఈ ప‌రీక్షకు మొత్తం ల‌క్ష డ‌భై ఆరు ల‌క్ష‌లు మంది ద‌ర‌ఖాస్తులు చేసుకోగా ..ల‌క్ష ఆర‌వై ఆరు వేల నాలుగ వంద‌ల అర‌వై మంది ప‌రీక్ష‌లు రాయ‌గా.. మొత్తం ల‌క్ష మూప్ఫై నాలుగు వేల రెండువంద‌ల ఐదు మంది విద్యార్ధులు ఆర్హ‌త‌ను సాధించారు. ఇక ఆగ్రిక‌ల్చ‌ర్, పార్మ‌సీ ఫ‌లితాలను ఈనెల 14న ప్ర‌కటించ‌నున్నారు.

Related posts