వార్తలు విద్య వార్తలు

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా!

AP DSC Notification postponed

నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదిరిచూస్తున్న డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ వాయిదా పడనుంది.  ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 10న నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉన్నా… ఆచరణకు అవసరమైన అన్ని శాఖల నుంచి స్పష్టత రాకపోవడంతో వాయిదా అనివార్యంగా మారింది. ఎన్ని పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీచేయాలి, విద్యాశాఖతో పాటు ఏయే శాఖలకు చెందిన ఖాళీలను ఇందులో కలపాలి, ఏ విధానంలో డీఎస్సీ నిర్వహించాలనే అంశాలపై స్పష్టత రాకపోవడంతో పాఠశాల విద్యా కమిషనరేట్‌ ఇంకా తుది షెడ్యూల్‌ను రూపొందించలేదు.

వివిధ అంశాలపై స్పష్టత వచ్చాక ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖకు చెందిన పోస్టులకు రోస్టర్‌ సిద్ధమైనప్పటికీ ఇతర శాఖల నుంచి రావాలి. మున్సిపల్‌ శాఖ ఇప్పటికే రోస్టర్‌ ఇచ్చి తమ పోస్టులను కూడా ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని కోరింది.మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తోన్న టీచర్లకు బదిలీలు నిర్వహించాలన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో సాంకేతికపరమైన సమస్య తలెత్తే పరిస్థితి నెలకొంది.

బీసీ సంక్షేమశాఖ తమ పరిధిలోని పోస్టుల భర్తీకి సంసిద్ధత తెలిపినా ఇంకా రోస్టర్‌ పూర్తిచేసి పంపాల్సి ఉంది. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల నుంచి టీచర్‌ పోస్టుల భర్తీపై బుధవారానికిగానీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ కు ముందస్తుగా పూర్తిచేయాల్సిన లాంఛనాలపై నిర్ణయాలు తీసుకోకపోవడంతో అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ తేదీనే కాదు… షెడ్యూల్‌ కూడా మారనుంది.

Related posts

అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేస్తా : డీకే అరుణ

admin

సెల్ టవర్ ఎక్కిన కానిస్టేబుల్…జారిపడటంతో తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలు…

chandra sekkhar

హత్యచేసి రైల్ ఇంజిన్ కి ….

jithu j

Leave a Comment