• Home
  • వార్తలు
  • ఏపీ డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్..10 న నోటిఫికేషన్
రాజకీయ వార్తలు వార్తలు విద్య వార్తలు

ఏపీ డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్..10 న నోటిఫికేషన్

AP DSC Notification, 10th October

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ షెడ్యూల్‌ని ప్రకటించింది. మొత్తం 9,270 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. ‘ఈ నెల 10న డీఎస్సీ నోటిఫికేషన్‌ని విడుదల చేస్తాము. నవంబర్‌ 30న పరీక్ష నిర్వహించి.. వచ్చే ఏడాది జనవరి 3న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.

 ఈ రోజు జరిగే కేబినేట్‌ మీటింగ్‌లో పీఈటీ పోస్టుల పెంపుపై ముఖ్యమంత్రితో చర్చించి తుది ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులేనంటూ ఎన్సీటీ ఈ ఉత్తర్వులు జారీచేయడంతో జులైలో వెలువడాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
నిరుపేదకు సాయమందించిన బాలయ్య… ఉచితంగా అన్ని…

నందమూరి బాలకృష్ణ షూటింగ్‌లో ఉండగా ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఓ నిరుపేద వ్యక్తి సడెన్‌గా వచ్చి ఆయన కాళ్లపై పడిపోయాడు. విషయం తెలుసుకున్న బాలయ్య చలించిపోయారట. ప్రస్తుతం బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ కృష్ణా జిల్లా హంసల దీవి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

ఈ చిత్ర షూటింగ్‌లో బాలయ్య ఉండగా.. ఓ వ్యక్తి వచ్చి బాలయ్య కాళ్లపై పడిపోయాడు. వెంటనే బాలయ్య అతన్ని పైకి లేపి విషయం అడగ్గా.. తాను నిరుపేదనని, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని.. తనకు సాయమందించాలని కోరాడని తెలుస్తోంది విషయం విని చలించిపోయిన బాలయ్య వెంటనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు ఫోన్ చేసి అతని వివరాలను తెలియజేసి.. ఉచిత వైద్యం అందించాలని ఆదేశించారట. దీంతో ఆ వ్యక్తి చాలా సంతోషించాడట. ఆ వ్యక్తి బాలయ్య కాళ్లకు మొక్కుతున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పిక్స్, కథనం షూటింగ్‌కి సంబంధించిందా? లేదంటే నిజంగానే జరిగిందా? తెలియాల్సి ఉంది.
ప్రముఖ హీరో, హీరోయిన్ లను తరిమికొట్టిన రౌడీలు

సినిమాల్లో హీరోల ఫైట్ సీన్లు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది… రౌడీలు ఎంతమంది వచ్చినా, కడుపులో కత్తి దిగినా లెక్క చేయకుండా తనవాళ్ళ కోసం ఫైట్ చేస్తారు. పోరాడి తమ కుటుంబాన్ని కాపాడుకుంటారు. మరి నిజ జీవితంలో హీరోలు ఎలా ఉంటారో తెలుసా…? తెలియకపోతే ఇది చదివి తెలుకోండి.

నటుడు జీవీ ప్రకాష్, అబర్నతి కలిసి తమిళంలో ‘జైల్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కన్నంగి నగర్ ప్రాంతంలో జరుగుతోంది. ఆ ప్రాంతానికి రౌడీ ఏరియా అనే పేరు ఉంది. తరచూ అక్కడ ఏదోక గొడవ జరుగుతూనే ఉంటుంది. తాజాగా నటుడు జీవీ ప్రకాష్, అబర్నతి షూటింగ్ లో ఉండగా, కొందరు వ్యక్తులు అక్కడికి వేట కొడవళ్ళతో వచ్చారట.

jail1

దాంతో షాక్ అయిన చిత్రయూనిట్ వెంటనే తేరుకొని అక్కడ నుండి పరుగులు పెట్టారట… ఇక హీరో, హీరోయిన్ షూటింగ్ నుండి పారిపోయి కొంతదూరంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నారని, పరిస్థితులు సద్దుమణిగిన తరువాత బయటకి వచ్చారని సమాచారం.పెంపుడు కుక్కపై కత్తి పెట్టి… యజమాని కూతురు బట్టలు విప్పమన్న డ్రైవర్

యజమాని కూతురినే లైంగికంగా వేధించడంతో పాటు తను చెప్పినట్లు చేయకపోతే తల్లిదండ్రులను చంపేస్తానంటూ బాలికను బెదిరిస్తున్న డ్రైవర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు ఓ సాప్ట్వేర్ ఇంజినీర్. రెండేండ్లుగా ఆ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు షేక్ ఇస్మాయిల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్తె ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. బాలిక ఓంటరిగా ఉన్న సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు ఇస్మాయిల్. ఇటీవల బాలిక కాలేజ్ నుంచి కారులో ఒంటరిగా వస్తున్న సమయంలో డ్రైవర్ ఇస్మాయిల్ ఓ చీకటి ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా బాలిక గట్టిగా కేకలు వేయడంతో  వదిలేశాడు.

అయితే జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే నీ తల్లిదండ్రులను చంపేస్తా అంటూ బెదిరించాడు. బాలికకు వీడియో కాల్ చేసి ఆమె పెంపుడు కుక్కపిల్ల మెడపై కత్తి పెట్టి బట్టలు తీయాలంటూ ఒత్తిడి తెచ్చాడు. దాంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలిక ఇస్మాయిల్ చెప్పినట్లు చేసింది. ఈ వీడియోను రికార్డు చేసిన ఇస్మాయిల్ తాను చెప్పినట్లు చేయాలని లేదంటే సోషల్‌ మీడియాలో ఆ వీడియో పెడతానని బెదిరిండాడు. అయితే కొంతకాలంగా ఆ బాలిక తీవ్ర మనోవేదనకు గురికావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి నిలదీయగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిందితుడిపై, నిర్భయ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

కళ కోసం కళ్యాణాన్నే వదులుకున్న బాలీవుడ్ హీరోయిన్

ektha-kapoor

సినిమా ఇండస్ట్రీలో సినిమానే జీవితంగా భావించి పెళ్లిని కాదనుకున్న వారు కొంతమంది ఉంటారు. అయితే అందులో బాలీవుడ్ భామ ఏక్తాకపూర్‌ కూడా ఉన్నారు. వెండితెర మీదా, బుల్లితెర మీదా నిర్మాతగా, దర్శకురాలిగా దూసుకుపోతున్న ఏక్తాకపూర్‌ సినిమాల కోసమే పెళ్ళికి దూరమైందట. తన ఫాదర్‌ తన ముందు రెండు ఆప్షన్లు ఉంచారట. పెళ్ళా, సినిమానా ఏదో ఒకటి తేల్చుకోమన్నారట. కళ కోసం తను కల్యాణాన్నే వదులుకున్నానని, సినిమాల్లోకి రాకపోయుంటే ఎప్పుడో తన పెళ్ళయిపోయి ఉండేదని స్వయంగా ఏక్తాకపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏక్తాకపూర్ సినిమాలు, సీరియళ్లు మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లు కూడా చేశారు.

 

Related posts

బీజేపీపై చంద్రబాబు విమర్శలు

admin

ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురి దుర్మరణం

madhu

పేప‌ర్ బాయ్ రైట్స్ తీసుకున్న గీతా ఆర్ట్స్…

chandra sekkhar

Leave a Comment