telugu navyamedia
andhra crime news political

వివేకా హత్య కేసు అన్ని కోణాల్లో విచారణ: ఆర్పీ ఠాకూర్

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు జరుగుతోందని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టంచేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. అలాగే కిడ్నీ రాకెట్ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. . విశాఖలో డ్రగ్స్ కేసులో నిందితులను అరెస్టు చేశామన్నారు. ఒక కార్యక్రమం పేరుతో అనుమతి తీసుకుని రేవ్ పార్టీ నిర్వహించారని తెలిపారు.

రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నాయని వివరించారు. ప్రతీ నెలా ఏడు నుంచి ఎనిమిది వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. అతి వేగం, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని డీజీపీ తేల్చిచెప్పారు. వైయస్ వివేకాహత్య వెనుక సూత్ర, పాత్రధారులెవరన్నది తేల్చేందుకు సిట్‌ మూడు అంశాలపై దృష్టి పెట్టి దర్యాప్తు సాగించింది.

Related posts

రవిప్రకాష్‌ కోసం బెంగళూరులో గాలింపు!

vimala p

శ్రీలంకకు .. చైనా భారీ నజరానా.. భారత్ పై గురి..

vimala p

టీడీపీ తో కలిసి..  కే.ఏ.పాల్ ప్రచారం.. 

vimala p