telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

భారీ వర్షాలు : పోలీస్ శాఖను అప్రమత్తం చేసిన ఏపీ డీజీపీ

రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులు భారీ వర్షాలున్నందున రాష్ట్రంలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుండి జిల్లా ఎస్.పీ లు. పోలీస్ కమీషనర్లందరూ అప్రమత్తంగా ఉండాలని డీ.జీ.పీ. గౌతం సవాంగ్ IPS ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోలీస్ శాఖ మొత్తాన్ని డీ.జీ.పీ. గౌతం సవాంగ్ అప్రమత్తం చేశారు.

పోలీస్ అధికారులందరూ 24 గంటల పాటు విధుల్లో ఉండి ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలుగ కుండా చూడాలని పేర్కొన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర విపత్తుల నివారణ శాఖ(SDRF), NDRF ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయాలని కోరారు. ఎక్కడ ఏవిధమైన ఇబ్బందులు ఎదురైనా సత్వరమే ప్రజలు డయల్ 100/112 కు సమాచారం అందించాలని రాష్ట్ర ప్రజలను డీ.జీ.పీ గౌతం సవాంగ్ కోరారు.

Related posts