telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

పోలవరానికి నిధులు ఇచ్చినా ఖర్చు చేయడం లేదు: అమిత్ షా

TDP Mla anitha comments Roja YCP
పోలవరానికి నిధులు ఇచ్చినా ఏపీ సీఎం చంద్రబాబు సరిగా ఖర్చు చేయడం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆరోపించారు. చంద్రబాబు, జగన్‌ వల్ల ఏపీ అభివృద్ధి కాదని, ఏపీ అభివృద్ధి ప్రధాని మోడీతోనే  సాధ్యమని  అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అయిదు నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ విభజన చట్టంలోని 90 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. ఏపీకి ఇన్ని ప్రాజెక్టులు ఎప్పుడూ రాలేదని తెలిపారు. కోస్తా ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం రూ. 55,475 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. రాజమండ్రి ఎయిర్ పోర్టుకు రూ. 180 కోట్లు ఇచ్చామని తెలిపారు. 
సీఎం చంద్రబాబుకు పాక్ ప్రధానిపై ఉన్న నమ్మకం భారత ప్రధానిపై లేదని  అమిత్‌ షా అన్నారు. దేశ ప్రధానిపై విశ్వాసం లేదంటున్న చంద్రబాబు పాకిస్థాన్‌ ప్రధానిపై విశ్వాసం ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పుల్వామా ఉగ్రదాడిపై కొందరు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అమిత్‌ షా మండిపడ్డారు. నాడు మోదీ ఇమేజ్‌తోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. గతంలో వాజ్ పేయి, ఎన్టీఆర్ లను చంద్రబాబు మోసం చేశారని, ఇప్పుడు మోడీని మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

Related posts