• Home
  • వార్తలు
  • ఏపీ ఉపముఖ్యమంత్రి కొడుకు…అరెస్టుకు సిద్ధం…స్టే దొరుకుతుందా…
రాజకీయ వార్తలు వార్తలు

ఏపీ ఉపముఖ్యమంత్రి కొడుకు…అరెస్టుకు సిద్ధం…స్టే దొరుకుతుందా…

ap deputy cm son arrest notice

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొడుకు కే.ఈ. శ్యాంబాబు గతంలో ఒక హత్య కేసులో స్టే తెచ్చుకున్నారు. అది గడువు తీరిపోవటంతో అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. కానీ కొడుకు కోసం మరోసారి స్టే కి సిద్ధం అవుతున్నాడు డిప్యూటీ సీఎం. కాగా నేర చరిత్ర ఉన్న వారిని రాజకీయ అనర్హత ఉందని చెబుతున్నా కూడా శ్యాంబాబును రాబోయే ఎన్నికలలో పోటీ చేయించి ఎమ్మెల్యే చేయాలని చూస్తున్నారు. దీనికి ఈసీ ఏమంటుందో చూడాలి మరి.

ఇక కేసు విషయానికి వస్తే గతంలో పత్తికొండ వైసీపీ ఇంచార్జి చేరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో నిందితులుగా డిప్యూటీ సీఎం కే.ఈ. కృష్ణమూర్తి తనయుడు శ్యాంబాబు, ఆస్సరి జడ్పీటీసీ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్.ఐ తులసి నాగప్రసాద్ ను నిందితులుగా చేర్చాలంటూ డోన్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. వీరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీచేసింది. 2017 మే 21న నారాయణరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి 15మంది ని నిందితులుగా పేర్కొంటూ హతుడి భార్య చేరుకులపాడు శ్రీదేవి పోలీసులకు పిర్యాదు చేసింది. కానీ పోలీసులు 12 మందిపైనే కేసు నమోదు చేశారు. దీనిపై ఆమె ప్రైవేట్ కేసు కూడా నమోదు చేశారు. దానితో శ్యాంబాబు, బొజ్జమ్మ, ఎస్.ఐ తులసి లను కూడా నిందితులలో చేర్చాలని జడ్జి తీర్పు చెప్పారు. గతంలోనే వీరిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయినప్పటికీ, వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. కానీ దాని గడువు ముగియడంతో వారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. అయితే గతంలో మాదిరి మళ్ళీ స్టే తెచ్చుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ప్రజలలో పలచన అయ్యే అవకాశం ఉంది.

Related posts

మాట-మనిషి….

chandra sekkhar

రాజకీయాల్లో మార్పు కోసమే ఫెడరల్ ఫ్రంట్ : కెసిఆర్

admin

16ఏళ్ల బాలుడితో కంగనా రనౌత్ స్టైలిస్ట్ శృంగారం… ఇప్పటికే 15మందితో… అరెస్ట్

nagaraj chanti

Leave a Comment