telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమరావతి : … జగన్ పాలనపై .. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మిశ్రమ స్పందన..

ap cpi leader ramakrishna on jagan as cm

ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్‌ ఆరు మాసాల పాలనపై మిశ్రమంగా స్పందించారు. జగన్‌ 6 నెలల పాలన కొందరికి మోదంగా, మరికొందరికి ఖేదంగా గడిచిందన్నారు. నవరత్నాల హామీల అమలుకు పూర్తిగా కాకపోయినా కొంత మేరకు కృషి జరిగిందన్నారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించారన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అంటూ కొత్త ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల్లో అభద్రతాభావం నెలకొందన్నారు. ఇప్పటికే కొంత మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు.

ఐదు నెలల పాటు ఇసుక సరఫరా ఆపేయడంతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం పడిందని, అన్న క్యాంటీన్ల మూసివేతతో నిరుపేదలు, దినసరి కూలీలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఖాతరు చేయడం లేదన్నారు. మంత్రులకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదన్నారు. రాష్ట్రంలో ఏకపక్ష, ఏకవ్యక్త పాలన సాగుతోందన్నారు. జగన్‌ 6 నెలల పాలన మిశ్రమ ఫలితాలనే మిగిల్చిందన్నారు.

Related posts