telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేసిన రఘువీర

AP Congress Manifesto released

ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హామీ ఇచ్చారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను పార్టీ నేతలతో కలిసి శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సమర్థంగా అమలు చేస్తామని చెప్పారు.

చేనేత కార్మికులకు అప్పులు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే స్వామినాథన్‌ కమిషన్‌ ఆధారంగా రైతులకు అండగా ఉంటామని తెలిపారు. వెనుబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా విద్యావ్యవస్థను పటిష్టం చేస్తామని చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు చేసే బాధ్యత కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. వంద శాతం కేంద్రం నిధులతో పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు.
మేనిఫెస్టో హామీలు ఇవే:
70 ఏళ్లు దాటిన వారికి రూ. 3వేలు పెన్షన్‌
పేదోడికి సంవత్సరానికి ఉచితంగా 4 గ్యాస్‌ సిలిండర్లు
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు కృషి
రజకులు, వడ్డెరులను ఎస్సీ జాబితాలో చేరుస్తాం
వాల్మీకి, మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తాం
చేనేత కార్మికులకు జీఎస్టీ నుంచి మినహాయింపు

Related posts