telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

కాబోయే ఏపీ సీఎం వైఎస్ జగన్ లైఫ్ స్టోరీ..

huge security to jagan oath program

వైఎస్ జగన్ యంగ్ డైనమిక్ లీడర్ .. తండ్రి బాటలో నడుస్తూ మడమతిప్పని మహానేత. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా,  వైసీపీ అధ్యక్షుడిగా  ఆంధ్ర ప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఏపీ రాజకీయాలు తెలిసినవారికి సుపరిచితుడు. సి‌బి‌ఐ దాడులు, ఈడీ కేసులు, 16 నెలల జైల్, కోడికత్తి దాడి వీటన్నింటినీ ఎదుర్కొని మొండి పట్టుదలతో ముందుకు సాగుతూ మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

AP CM YS Jagan Mohan Reddy Life Story

1972 డిసెంబర్ 21న వైఎస్ జగన్ జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం పులివెందులలో ప్రారంభించిన జగన్ హైదరాబాద్ బేగంపేట్ పబ్లిక్ స్కూల్ లో విద్యాభ్యాసం చేశారు. అనంతరం నిజాం కాలేజీ ప్రగతి విద్యాల్యంలో బీ.కాం చదివారు. పై చదువులకోసం లండన్  వెళ్లిన జగన్ అక్కడ ఎంబీఏ చదివారు.

AP CM YS Jagan Mohan Reddy Life Story

పులివెందులలో ఎంతో పేరున్న డాక్టర్ గంగిరెడ్డి, డాక్టర్ సుగుణ రెడ్డి దంపతుల కుమార్తె  భారతిని 1996 ఆగష్టు 28న  జగన్ పెళ్లిచేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి తల్లి భారతి తల్లి  సుగుణ రెడ్డి ఎంబిబియస్ లో క్లాస్ మేట్స్ కావడంతో జగన్ పెళ్ళి భారతితో నిచ్చయమైంది. జగన్ కు ఇద్దరు కుమార్తెలు వర్షా రెడ్డి, హర్షా రెడ్డి వీరిద్దరు ఉన్నత చదువులు చదువుతున్నారు. 
AP CM YS Jagan Mohan Reddy Life Story
 2009 లో తొలిసారిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన జగన్ కడప ఎంపీగా గెలుపొందారు. అప్పుడు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో జగన్ రాజకీయాల్లో మరింత ముందుకు సాగాడు. నిత్యం ప్రజలమధ్య ఉంటూ అభిమానుల  మన్ననలు పొందారు.  2002  సెప్టెంబర్ 2న చిత్తూర్ జిల్లాలో  రచ్చబండ కార్యక్రమానికి  వెళ్తుండగా హెలిక్యాప్టర్  ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మరణించారు. తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని అభిమానులు పట్టుబట్టారు. ఈ విషయాన్ని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాందీ జగన్ ను పక్కకుపెట్టి రోషయ్యను ముఖ్యంత్రి చేసింది. కొంత కాలానికే రోషయ్య పై వ్యతిరేకత రావడంతో సోనియా కిరణ్ కుయార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది. 
sonia and rahul appeal to court on case
వైఎస్ మరణాన్ని తట్టుకులేక రాష్ట్రంలో 67 మంది మరణించారు. వీరిలో కొంతమంది ఆత్మహత్య చేసుకోగా మరికొందరు గుండె పోటుతో మృతి చెందారు. వైఎస్ మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  మరణించిన కుటుంభాలను కలిసేందుకు ఓదార్పు యాత్ర చేపట్టారు. జగన్ ఓదార్పు  యాత్రను సోనియా వ్యతిరేకించినపట్టికీ జగన్ మొండిపట్టుతో ముందుకు సాగారు.  ఓదార్పు యాత్ర తో ప్రజలకు మరింత  జగన్ చేరువయ్యాడు. అప్పటి నుంచి జగన్  ను కాంగ్రెస్ హైకమాండ్ టార్గెట్ చేసింది. దీంతో జగన్ కాంగ్రెస్ ను వీడాలని నిర్ణయించుకున్నారు.
 AP CM YS Jagan Mohan Reddy Life Story
2011 మార్చి 11న ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి సమాది వద్ద జగన్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. తొలుత జగన్, విజయమ్మ ఇద్దరే ఉన్న ఈ పార్టీలో 19 మంది ఎమ్మేల్యేలు, ఎంపీ మేకపాటి వెసీపీ లో చేరారు. వారు పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ 2 ఎంపీ, 16 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుంది. కడప ఎంపీగా వైఎస్ జగన్ 5 లక్షల 40 వేల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 

కాంగ్రెస్ ను వీడి ఉప ఎన్నికలకు వెళ్ళిన జగన్ పై  కాంగ్రెస్ దృష్టి పెట్టింది. తండ్రిని అడ్డంపెట్టుకొని అక్రమాస్తులు సంపాదించావని కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు జగన్ పై కేసు వేశారు. ఈ కేసును సుమోటగా స్వీకరించిన హైకోర్ట్  విచారణకు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసును అప్పటి సి‌బి‌ఐ జేడీ లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. 2012 మే 27న జగన్ అరెస్టు అయ్యారు. చంచల్ గూడ జైలులో 16 నెలలు గడిపిన అనంతరం నాంపల్లి  సి‌బి‌ఐ కోర్ట్ షరతులతో కూడిన బేలు మంజురి చేసింది. 
AP CM YS Jagan Mohan Reddy Life Story
 ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో 67 ఎమ్మెల్యే, 9  ఎంపీ సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. వీరిలో  20 మంది ఎమెల్యేలు టీడీపీలో చేరారు. తెలంగాణలో ఖమ్మం ఎంపీగా గెలుపొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. 

huge security to chandrababu and jagan

దీంతో జగన్  ఏపీ ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు 2013 నవంబర్ 6 వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్రను చేపట్టారు.  341 రోజుల ఈ యాత్రలో జగన్ కు  ప్రజలు మరింత చేరువయ్యారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాల భర్తీ, మేఘా డిఎస్సీ, కాంట్రీబ్యూషన్ పెన్షన్, ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం వంటి   పలు హీమీలతో ప్రజలకు భరోసా కలిపించి మొన్నటి  ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో  151 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొంది వైసీపీ  ఘన విజయం సాధించింది. దీంతో ఈ నెల 30న ఆ పార్టీ అధినేత  వైఎస్ జగన్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం  చేయనున్నారు.

Related posts