telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు సీఎం జగన్‌ కడప పర్యటన.. భారీ బందోబస్తు ఏర్పాటు

jagan

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో కడప జిల్లాకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. అక్కడ నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ హెలికాఫ్టర్‌లో బయల్దేరి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌ వద్దకు చేరుకుంటారు. 8.45 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు వెళతారు. 8.50 నుంచి 9.10 గంటల వరకూ ఘాట్‌ వద్ద వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొంటారు.

9.15 గంటలకు రోడ్డు మార్గాన బయల్దేరి 9.30 గంటలకు చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రానికి చేరుకుంటారు. గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తారు. 10 గంటల వరకూ అక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి ఇడుపులపాయ ఎస్టేట్‌ వద్దకు చేరుకుంటారు. 10.20 గంటలకు హెలికాఫ్టర్‌లో బయల్దేరి 10.40 గంటలకు జమ్మలమడుగు మండలం కన్నెలూరు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి బహిరంగ సభ ప్రదేశానికి వెళతారు. అక్కడ ఏర్పాటు చేసి స్టాల్స్‌ను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళతారు.

Related posts