telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి రోజు నుంచి ఇళ్ల స్థలాల పంపిణి…

cm jagan

నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిధిగా విజయవాడలో బిసి సంక్రాంతి సభ జరిగింది.  56 బిసి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు.  ఆ తరువాత సీఎం జగన్ మాట్లాడారు.  ఇదే వేదికపై 18 నెలల క్రితం సీఎంగా ప్రమాణస్వీకారం చేసారని, ప్రమాణస్వీకారం చేసిన సమయంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని అన్నారు.  వెనకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు ఇవ్వడం దేశ చరిత్రలో లేదని అన్నారు.  వెనకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు ఇవ్వడం ఎక్కడైనా చూసారా అని జగన్ అన్నారు.  ప్రతి అర్హుడు సంక్షేమ పధకాలు అందుకోవాలని కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  ఇప్పటికే బిసి కార్పొరేషన్ల కోసం రూ.38 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు.  ఇక డిసెంబర్ 25 నుంచి ఇళ్ల స్థలాలను పంపిణి చేస్తామని అన్నారు.  క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి రోజు నుంచి ఇళ్ల స్థలాల పంపిణి ఉంటుందని, కోర్టు ఆర్డర్లు వచ్చిన తరువాత ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయిస్తామని జగన్ తెలిపారు. చూడాలి మరి ఏం జరుగుతుంది… అనేది.

Related posts