telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తప్పు చేస్తే ఉపేక్షించను.. ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్

cm jagan on govt school standardization

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు ఉండవల్లి కలెక్టర్ల సదస్సులో జగన్ మాట్లాడుతూ అవినీతికి, అక్రమాలకు, దోపిడీకి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎవైరైనా అవినీతికి పాల్పడితే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి మద్దతు ఉండదని స్పష్టం చేశారు.

తప్పు చేసిన వారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు పని చేయాలని చెప్పారు. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించాలని పార్టీ నేతలకు సూచించారు.

Related posts