telugu navyamedia
andhra news political

ఆగస్టు లో సీఎం జగన్ అమెరికా పర్యటన!

jagan

ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జగన్ తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. త్వరలో కుటుంబసభ్యులతో కలిసి అమెరికాలో పర్యటించనున్నారు. అయితే, అమెరికా వెళ్లేముందు జెరూసలెం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రతి ఏటా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన జెరూసలెం వెళ్లడం జగన్ కుటుంబానికి ఆనవాయితీ.

ఈ క్రమంలో జగన్ కుటుంబ సభ్యులతో కలిసి    ఆగస్టు 1న జెరూసలెం వెళ్లి అక్కడ 5 రోజుల పాటు పర్యటిస్తారు. ఆపై తిరిగి అమరావతి చేరుకుంటారు. మరలా, ఆగస్టు 17న అమెరికా చేరుకుని 23వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ ఆహ్వాన సభతో పాటు డల్లాస్ లోని కే బెల్లే కన్వెన్షన్ సెంటర్ లో ప్రవాసాంధ్రులు నిర్వహించే భారీ సభకు జగన్ హాజరు కానున్నారు.

Related posts

ఎఫ్.సి.ఐ.లో .. మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం..

vimala p

గోవాకు ఎవరు వచ్చినా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే!

vimala p

పౌరసత్వ సవరణ బిల్లుపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

vimala p