telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏసీబీ పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తి

jagan

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పని తీరుపనితీరుపై ఏపీ సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీబీపై ఈరోజు ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదని పేర్కొన్నారు. విధినిర్వహణలో సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.

ప్రజలు ఎవ్వరూ కూడా అవినీతి బారిన పడకూడదని చెప్పారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా లంచాలు చెల్లించే పరిస్థితి ఉండకూడదని, లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలని అన్నారు. సెలవులు లేకుండా పనిచేయాలని, మూడు నెలల్లోగా మార్పు కనిపించాలని ఆదేశించారు. ఏసీబీకి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరో నెల రోజుల్లో మళ్లీ సమీక్షిస్తామని తెలిపారు.

Related posts