telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మన శాస్త్రవేత్తలను చూసి యావత్‌ భారత్‌ గర్విస్తోంది: జగన్

jagan

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగానికి చివరిదశలో అవాంతరాలు ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ట్విటర్ లో స్పందించారు. మన శాస్త్రవేత్తలను చూసి యావత్‌ భారత్‌ గర్విస్తోందన్నారు.

విక్రమ్‌ ల్యాండర్‌ దాదాపుగా చంద్రుడి ఉపరితలానికి చేరుకుందని, చివరి ఘట్టంలో తలెత్తిన చిన్న అడ్డంకి మన విజయానికి పునాద కావాలన్నారు. ఇలాంటి చిరు అడ్డంకి భావి విజయాలకు మెట్టుగా మలుచుకొని ముందుకు సాగాలని జగన్ పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో యావత్‌ దేశం ఇస్రో బృందానికి అండగా ఉందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల అసాధారణ కృషికి అభినందనలు తెలియజేశారు.

Related posts