telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పీపీఏలపై సమీక్ష అనగానే చంద్రబాబు వణికిపోతున్నారు: జగన్

cm jagan on govt school standardization

పీపీఏల వ్యవహారం పై ఏపీ అసెంబ్లీ అట్టుడుకింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సభలో మాట్లాడుతూ గత మూడేళ్లలో పీపీఏల విషయంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. టెక్నాలజీకి తానే శ్రీకారం చుట్టానని చంద్రబాబు చెప్పుకుంటుంటారని, మరి ఆ టెక్నాలజీతో ఇంత నష్టం వస్తుందని చంద్రబాబుకు తెలియదా అంటూ మండిపడ్డారు.

విద్యుత్ రంగంలో కేంద్రం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు కూడా మూడేళ్లలో రూ.540 కోట్లకు మించలేదని అన్నారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అవసరం లేకున్నా, అధికధరలకు విద్యుత్ కొనుగోలు చేశారనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని జగన్ స్పష్టం చేశారు. 2016 నుంచి 2018 వరకు రూ.5497 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశారని, ఇప్పుడు పీపీఏలపై సమీక్ష అనగానే చంద్రబాబు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు.

Related posts