telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్…

తిరుపతిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన హోంశాఖ మంత్రి అమిత్ షా  కొన్ని కారణాల వలన రాలేకపోతున్నారు.  దీంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో  హోంశాఖమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీలను కలవనున్నారు.  వారితో అనేక విషయాలపై చర్చించబోతున్నారు.  ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విషయంపై ప్రధాని, హోంశాఖ మంత్రితో మాట్లాడబోతున్నారు.  అదే విధంగా విభజన హామీలు, ఏపీ ప్రత్యేక హోదా తదితర అంశాలపై జగన్ ఇరువురి నేతలతో జరిగే భేటీలో చర్చించబోతున్నారు.  ఏపీ రాజధానిని విశాఖకు తరలించాలని జగన్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.  ఈ సమయంలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తుండటంతో దాని వలన జగన్ సర్కార్ కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది.  అందుకే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం లేదంటే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని జగన్ కోరబోతున్నారు. చూడాలి మరి కేంద్రం ఈ విషయంలో జగన్ కు ఏ సమాధానం చెప్పి పంపిస్తుంది అనేది.

Related posts