telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి నిర్మాణంపై .. కేంద్రానికి విన్నపాలు ..

parliament india

ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలు కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభ శూన్యగంటలో కనక మేడల ఈ అంశాన్ని లేవనెత్తారు. 22-10-2015న ప్రధాని మోదీ ..ఏపీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూ సమీకరణలో భాగంగా 28 వేల మంది రైతులు 33వేల ఎకరాల భూమిని ఎలాంటి వివాదాలకు తావులేకుండా స్వచ్ఛందంగా ఇచ్చారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మె్ల్సీలు, అఖిలభారత సర్వీసు అధికారుల వసతి కోసం రూ.24వేల కోట్లతో పనులు చేపట్టారు.

ఈ సమయంలో 2019లో అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం నిర్మాణాలను మధ్యలోనే ఆపేసింది. దాని వల్ల 28వేల మంది రైతులు రోడ్డున పడ్డారు. రాష్ట్ర ప్రజల్లో అనిశ్చితి నెలకొంది. అమరావతిలో నిర్మాణాలు కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచన ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నానని కనకమేడల విజ్ఞప్తి చేశారు.

Related posts