telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ముగిసిన ఏపీ కేబినెట్..వివరాలు వెల్లడించిన మంత్రి

perni nani minister

ఏపీ కేబినెట్ తీర్మానాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. జీఎన్ రావు కమిటీ నివేదిక గురించి మంత్రిమండలి సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు. అయితే త్వరలోనే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక రానుందని, ఆపై ఓ హైలెవెల్ కమిటీ రెండు నివేదికలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు పరిధిని కుదిస్తూ రామయ్యపట్నం పోర్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

స్థానికసంస్థల ఎన్నికల్లో పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కడప జిల్లా రాయచోటిలో వక్ఫ్‌ బోర్డుకు 4ఎకరాలు కేటాయించామన్నారు. 108 అంబులెన్స్‌లు 412 కొనుగోలుకు రూ. 71కోట్ల పైచిలుకు, 104 వాహనాలు 654 కొనుగోలుకు రూ.60.50 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాలకు ఏడాది ముందే మద్దతు ధరను ప్రకటించి, ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. దీని కోసం 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలను నిర్మించనున్నట్టు చెప్పారు.

Related posts