telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ముగిసిన ఏపీ కాబినేట్ సమావేశం..డేటా చౌర్యం పై చర్చ 

Chandrababu comments Jagan cases
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబినేట్ సమావేశం ముగిసింది. సమావేశంలో టీడీపీ డేటా చోరీ  పై మంత్రులతో సీఎం కీలక చర్చ నిర్వహించారు.  ఏపీ ప్రభుత్వంపై కేసులు పెడతామని తెలంగాణ పోలీసులు హెచ్చరించడాన్ని కేబినేట్ భేటిలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో ఓ మంత్రి మాట్లాడుతూ టీడీపీ డేటాను దొంగిలించి ప్రత్యర్థులకు అప్పగించారని అన్నారు. అంతే కాకుండా డేటా చోరీని కప్పిపుచ్చుకునేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలనే విషయంపై మంత్రివర్గం చర్చించింది. 
తెలంగాణ ప్రభుత్వ వేధింపులపై మంత్రివర్గం చర్చించింది. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ బకాయిలు, పోలవరంపై కేసులను తీవ్రంగా పరిగణించారు. ఆస్తుల పంపిణీకి సహకరించకపోగా నిందలు వేస్తున్నారన్నారు. విభజన చట్టం అమలుకు ఆలంకాలు కల్పించడంపై మంత్రివర్గంలో చర్చించారు. ఏపీకి రావాల్సినవి వెంటనే రాబట్టే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరును తేలిగ్గా తీసుకోవద్దని కేబినెట్‌లో విస్తృతంగా చర్చించారు.

Related posts