telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

టీఆర్ఎస్ గతే వైసీపీకి పడుతుంది…

శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీడియా అధికార ప్రతినిధి బైరెడ్డి శబరి దర్శించుకున్నారు. శ్రీశైల ఆలయ హరిహారరాయ గోపురం వద్దకు చేరుకున్న బైరెడ్డి శబరికి ఆలయ ప్రోటోకాల్ ఏవోఓ డి.మల్లయ్య స్వాగతం పలికారు. అనంతరం భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలోని శ్రీశైల జగద్గురు 1008 శ్రీ చెన్న సిద్ధరామ శివాచర్య స్వామిజీ దర్శించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్న బైరెడ్డి శబరి అనంతరం అమ్మవారి ఆశీర్వచనం మండపంలో బైరెడ్డి శబరికి ఆలయ అర్చకులు, వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీ స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్తీకమాసం కావడంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చానని అలానే మొన్న జరిగిన ఓంకారం దేవాలయంలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వివక్షణరాహితంగా పూజరాలపై సార్నాకొలతో కొట్టడం దారుణం అన్నారు. రాష్ట్రములో ఎమ్మెల్యేలు, ఎంపీ అలాగే ప్రతి చోట కూడా లోకల్ నాయకులతో సహా అందరూ వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని, ఆలయలలో టికెట్స్ పెట్టి వ్యాపారం చేస్తున్నారని, ఇప్పటికే శ్రీశైలంలో జరిగిన అవినీతికి పాల్పడ్డ వాళ్ళను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. మొన్నటి తుంగభద్ర పుష్కారాలకు కనీసం హిందువులకు స్నానాలు కూడా చేయనియకుండా అరెస్టులు చేశారు, ఓంకారం దేవాలయ పూజారుల దాడి విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మాట్లాడకపోడం బాధాకరం అన్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు తెలంగాణలో టీఆర్ఎస్ కి పట్టినగతే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి పడుతుందన్నారు.

Related posts