telugu navyamedia
andhra political

ఏపీ బంద్ కు.. చంద్రబాబు మద్దతు

విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ‘ప్రత్యేకహోదా సాధన సమితి’ వచ్చే నెల 1న చేపట్టనున్న ఏపీ బంద్ కు సీఎం చంద్రబాబు పరోక్షంగా మద్దతు తెలిపారు. అమరావతిలో జిల్లా కలెక్టర్లతో ఈరోజు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడారు. బంద్ కు సంఘీభావంగా ఆరోజు నిర్వహించాల్సిన జన్మభూమి సమావేశాలను ఫిబ్రవరి 2,3,4 తేదీలకు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీచేశారు.
జన్మభూమి సమావేశాల్లో ప్రజలు ప్రస్తావించిన సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అన్న క్యాంటీన్ల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రకృతి సేద్యంపై కూడా దృష్టి పెట్టాలని  చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts

మాపై దాడులే.. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఆ ..! : చంద్రబాబు

vimala p

జనసేన పార్టీ కమిటీల ఏర్పాటు..రేపు విజయవాడలో ప్రకటన!

vimala p

కాపర్ డాం తోనే .. ప్రాజెక్ట్ పూర్తీ అంటూ.. మోసం : ఉండవల్లి

vimala p