telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదా పై మాటల యుద్దం

AP assembly special status discussion

ఏపీ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేకహోదా అంశంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్ విపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది, ఆయన నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేఅంటూ వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ సభ్యులు మండిపడ్డారు. ప్రత్యేకహోదా ఇచ్చిన తర్వాత, దాన్ని అమలు చేసేందుకు ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైతే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రత్యేకహోదా ఇవ్వమని మళ్లీ అడగడం ఎందుకో అర్థం కావడంలేదు అధ్యక్షా అంటూ జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు.

దాంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రానికి లోనయ్యారు. ఘాటైన పదజాలంతో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. “అచ్చెన్నాయుడు గారూ మీరు ఉపయోగించిన ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే, మీ ఉద్దేశం ఏంటి? సీఎం గారు మొదటి రోజే చెప్పారు, నాకు సభపై పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సభలో అవకాశం కావాలంటే నన్నడగాలని తేల్చి చెప్పారు. . ఇక మీ వాదనలు ఆపి కూర్చోండి. అవకాశం ఇస్తాను కానీ ఇది పద్ధతి కాదు అంటూ స్పీకర్ మండిపడ్డారు.

Related posts