telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు… నేటి నుండే..

ap assembly sessions date confirmed

నేటి నుంచి ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు సమావేశాలు జరగనుండగా, నేటి ఉదయం 11 గంటలకు తొలి సమావేశం ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు స్పీకర్ ఎన్నిక ఉంటుంది.

శుక్రవారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 15, 16 తేదీల్లో సభకు విరామం కాగా, 17,18 తేదీల్లో తిరిగి సమావేశాలు కొనసాగనున్నాయి. ఆ రెండు రోజులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అనంతరం సభ వాయిదా పడుతుంది. తిరిగి జూలైలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఉదయం 10:30 గంటలకు శాసనసభలోని తన చాంబర్‌లో అడుగుపెడతారు. వేదపండితుల పూజా కార్యక్రమాల అనంతరం తన సీట్లో కూర్చుంటారు. 11:05 గంటలకు శాసనసభలో అడుగుపెడతారు. ప్రస్తుత అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 151 కాగా, తెలుగుదేశం పార్టీకి 23 మంది, జనసేనకు ఒక ఎమ్మెల్యే బలం ఉంది.

Related posts