telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేంద్రం సూచనతో ఏపీకీ ఆర్థిక సాయం నిలిపివేత: వరల్డ్ బ్యాంక్

ap logo

ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ బ్యాంకు రుణం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే ప్రపంచ బ్యాంక్ రుణాలు ఇవ్వడం లేదని టీడీపీ ఆరోపించింది. ఈ క్రమమంలో ఏపీ రాజధాని అమరావతికి అమరావతికి రుణ ప్రతిపాదనను ఎందుకు రద్దు చేసిన విషయాన్ని స్పష్టం చేస్తూ వరల్డ్ బ్యాంక్ ఓ ప్రకటన వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం సూచనతోనే అమరావతికి ఆర్థికసాయాన్ని ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. రాజధాని మౌలిక వసతుల అభివృద్ధికి రుణం ఇవ్వాలని ప్రపంచ బ్యాంకుకు ఏపీలోని గత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుని కేంద్రానికి ఈ నెల 15న లేఖ రాసినట్టు వెల్లడించింది.

Related posts