telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

18 డిమాండ్లతో రాష్ట్రపతికి వినతి పత్రం!

భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తో ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నేతృత్వంలోని 11 మందితో కూడిన బృందం మంగళవారం భేటీ అయింది. ఈ భేటీలో ఆయనతోపాటు ఎంపీ అశోక్‌గజపతిరాజు, పలువురు టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారు. చంద్రబాబు ఏపీ భవన్‌ నుంచి ఎంపీలు, పార్టీల నేతలతో కలిసి రాష్ట్రపతి భవన్‌ వరకు పాదయాత్రగా నడిచి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అందజేశారు.

అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని కోవింద్ ను కోరామని చెప్పారు.విభజన హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో మోదీ చెప్పిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రధాని మోడీకి నాయకత్వ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన మోడీకి లోదని అన్నారు. ఢిల్లీ దీక్షతో ఏపీ ప్రజల బాధను దేశం మొత్తానికి తెలియజేశామని చెప్పారు.

Related posts