telugu navyamedia
telugu cinema news trending

‘నిశ్శబ్దం’ ట్రైలర్

nishabdam

హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్దం’ సినిమాలో మాధవన్ అనుష్క జంటగా నటించారు. అంజలి, సుబ్బరాజు ఇన్వెస్టిగేషన్ అధికారులుగా కనిపించారు. ఈ సినిమాలో అనుష్క మూగ యువతి పాత్రలో నటించారు.ఇందులో హాలీవుడ్ నటుడు మైఖెల్ మ్యాడ్సన్ కీలక పాత్రను పోషించారు. శుక్రవారం ‘నిశ్శబ్దం’ థియేట్రికల్ ట్రైలర్ నేచురల్ స్టార్ నాని జయం రవి, మనోజ్ బాజ్‌పేయి రిలీజ్ చేశారు. 1:25 నిమిషాల నిడివిగల ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఓ హాంటెడ్ హౌస్ ముందు ఓ విదేశీ రిపోర్టర్ నిలబడి న్యూస్ చదువుతున్న సీన్‌తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఈ ఇంట్లోకి అనుష్క వెళ్లినప్పుడు ఆమెపై ఎవరో ఎటాక్ చేస్తారు. దాంతో అనుష్కను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. ఈ కేసును సుబ్బరాజు, అంజలి కలిసి డీల్ చేస్తుంటారు.అనుష్క మరోసారి తన నటనతో ఆకట్టుకోనుందని అర్థమవుతుంది.

Related posts

జ‌ర్న‌లిస్టుల‌కు నారా లోకేష్ బీమా ధీమా

vimala p

శృంగార సమస్యలకు ఈ చిన్న చిట్కాతో చెక్‌ పెట్టండి !

Vasishta Reddy

తెలంగాణాలో .. భూ రిజిస్ట్రేషన్ ధరలు పెంపు..

vimala p