telugu navyamedia
సినిమా వార్తలు

“నిశ్శబ్దం”గా షూటింగ్ పూర్తి చేసిన అనుష్క

Anushka

హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా “నిశ్శబ్దం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంజలి, మైఖేల్‌మ్యాడ్‌సన్, షాలినిపాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. అనుష్క నటిస్తోన్న “నిశ్శబ్ధం” చిత్రాన్ని మిగతా భాషల్లో “సైలెన్స్” పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఆదివారం అనుష్క అండ్ టీం సినిమా షూటింగ్ కు ప్యాకప్ చెప్పింది. చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ షెడ్యూల్ అమెరికాలో పూర్తి చేసింది. అనుష్క, మాధవన్, షాలినిపాండేతోపాటు చిత్ర బృందం త్వరలోనే సినిమా ప్రమోషన్స్ షురూ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Related posts