telugu navyamedia
సినిమా వార్తలు

అనుష్క షాకింగ్ లుక్…!

Anushka

స్టార్ హీరోయిన్ అనుష్క “బాహుబలి” తరువాత నటిస్తున్న తాజా చిత్రం “నిశ్శబ్దం”. హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా “నిశ్శబ్దం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంజలి, మైఖేల్‌మ్యాడ్‌సన్, షాలినిపాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. అనుష్క నటిస్తోన్న “నిశ్శబ్ధం” చిత్రాన్ని మిగతా భాషల్లో “సైలెన్స్” పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. బాహుబలి తర్వాత అనుష్క కేవలం భాగమతి చిత్రంలో మాత్రమే నటించింది. ఆ చిత్రం తర్వాత అనుష్క కాస్త బొద్దుగా మారింది. ఆ తరువాత అనుష్క స్లిమ్ గా అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమాలు కూడా చేయకపోవడంతో అనేక రూమర్లు విపించాయి. యూఎస్ లో షూటింగ్ పూర్తయిన తర్వాత ఇటీవల అనుష్క హైదరాబాద్ కు తిరిగొచ్చింది. విమానాశ్రయంలో అనుష్క కనిపించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అనుష్క లేటెస్ట్ లుక్ షాకిచ్చే విధంగా ఉంది. అనుష్క మళ్ళీ బొద్దుగా మారినట్లు ఉన్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. గతంలో అనుష్క “సైజ్ జీరో” చిత్రం కోసం కూడా బొద్దుగా మారింది.

Related posts