telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనుష్కను పెళ్లి చేసుకోబోయేది ఇతడేనా…?

anushka

స్వీటీ భామ అనుష్క టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తనయుడు, యంగ్ డైరెక్టర్ ప్రకాశ్ కోవెలమూడి ప్రేమలో పడిందని, అతడినే ఆమె పెళ్లిచేసుకోబోతోందన్న వార్త హల్‌చల్ చేస్తోంది. 44 ఏళ్ల ప్రకాశ్.. 38 ఏళ్ల అనుష్క ఇద్దరూ ఒక్కటయ్యే అవకాశం ఉందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయంపై ఇద్దరూ ఇప్పటిదాకా పెదవి విప్పలేదు. అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో నటిస్తోంది. 2015లో విడుదలైన సైజ్‌ జీరో మూవీకి ప్రకాశ్‌ దర్శకత్వం వహించగా అనుష్క ప్రధాన పాత్రలో నటించింది. అప్పటినుంచి వీరిద్దరూ ప్రేమించు కుంటున్నారట. త్వరలోనే ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రకాశ్‌కు ఇది వరకే పెళ్లైంది. ముంబైకి చెందిన స్క్రీన్‌ప్లే రైటర్‌‌ కనికా ధిల్లాన్‌ను 2014లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ, మూడేళ్ల తర్వాత ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

Related posts