telugu navyamedia
telugu cinema news trending

“పాతాళ్‌లోక్”పై విమర్శలు… స్పందించిన అనుష్క శర్మ

anushka

బాలీవుడ్ బ్యూటి అనుష్క శర్మ నిర్మించిన ఫ‌స్ట్ వెబ్‌ సిరీస్‌ ‘పాతాళ్‌లోక్‌’. ‘పాతాళ్‌లోక్’ రిలీజైన‌ప్ప‌టి నుంచి దాని చుట్టూ వివాదాలు చెలరేగాయి. ఇందులోని ఓ సీన్ లో గూర్ఖా వర్గాన్ని కించపరిచే డైలాగ్స్ ఉన్నాయంటూ ఆ వర్గం వారు ఫైర‌య్యారు. మరోపక్క బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్‌ గుర్జర్‌ ఈ సిరీస్‌కు వ్యతిరేకంగా కేసు పెట్టారు. ప‌ర్మిష‌న్ లేకుండా ఓ సన్నివేశంలో తన ఫొటో వాడారంటూ ఆరోపణలు చేశారు. ఈ వెబ్ సిరీస్ కంటెంట్‌ సైఫ్‌ అలీ ఖాన్ యాక్ట్ చేసిన‌ సిరీస్‌ ‘సేక్రేడ్‌ గేమ్స్‌’లా ఉందని విమర్శించారు. ఇలా తన సిరీస్‌ను పోల్చడం గురించి అనుష్క తాజాగా రెస్పాండ్ అయ్యారు. “ప్రజలు ఎప్పుడూ రెండింటి మధ్య పోలికలు వెతకడానికి ట్రై చేస్తుంటారు. కానీ రెండు సిరీస్‌లు పూర్తిగా భిన్నం. దేని స్పెషాలిటీ దానికి ఉంది. ఓటీటీ వేదికకు మంచి కంటెంట్‌ ఇచ్చేందుకు చాలా మంది కష్టపడి వ‌ర్క్ చేస్తున్నారు. వారందరికీ అభినందన‌లు తెలియ‌జేస్తున్నా” అని చెప్పారు. ‘పాతాళ్‌లోక్‌’కు అవినాష్‌ అరుణ్ డైరెక్ట్ చేశారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో నీరజ్ కబీ, అభిషేక్ బెనర్జీ, జైదీప్ అహ్లవత్ లీడ్ రోల్స్ లో నటించారు. మే 15న అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైన‌ ఈ సిరీస్‌ ఆసక్తికరంగా ఉందని నెటిజన్లతోపాటు సెల‌బ్రిటీలు సైతం మెచ్చుకున్నారు. విరాట్‌ కోహ్లీ, అనురాగ్‌ కశ్యప్‌, అర్జున్‌ కపూర్‌, దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ తదితరులు సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌లు చేశారు. అనుష్క తన బ్ర‌ద‌ర్ కర్ణేష్‌ శర్మతో కలిసి దీన్ని నిర్మించారు.

Related posts

ఏపీలో … తీవ్రంగా వడగాలులు వీచే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

vimala p

వైవా హర్ష భార్య గతం మరిచిపోయిందంట… అసలేం జరిగిందంటే ?

vimala p

రాశిఫలాలు : .. ఆరోగ్యం జాగర్త.. తొందరపాటు నిర్ణయాలు సరికాదు..

vimala p