telugu navyamedia
సినిమా వార్తలు

సినిమాల నుంచి అనుష్క రిటైర్మెంట్… స్పందించిన బ్యూటీ

Anushka Sharma on Movie Retirement

ఇటీవల కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై మీడియా “మీరు నటిగా రిటైరవుతారన్న వార్త నిజమేనా?” అంటూ అనుష్క శర్మను ప్రశ్నంచగా… స్పందించిన ఆమె “ఇది పూర్తిగా అవాస్తవం. నేను చెప్పింది వేరు, వార్తల్లో వస్తోంది వేరు. పిల్లలు పుట్టిన తరువాత సినిమాలకి గుడ్‌ బై చెప్పేసి వారికే పూర్తి సమయం కేటాయిస్తానని చెప్పాను.

 

ఆ గుడ్‌ బై ఇవాళో రేపో చెప్పేస్తానన్నంత హడావిడి చేస్తున్నారు. పిల్లలకు ఇంకా సమయముంది. విరాట్‌, నేనూ ఇద్దరం మా రంగాలలో ఫుల్‌ బిజీగా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో పిల్లలు పుడితే వారిని రోజుకోసారి అయినా చూసుకునే అవకాశముండదు. మా రంగాలలో కొద్దిగా టైం దొరికింది అనుకున్నప్పుడు పిల్లల కోసం ప్లాన్‌ చేసుకుంటాం. అప్పటి వరకు నటిస్తూనే ఉంటాను. సినిమాలు నిర్మిస్తూనే ఉంటాను” అని తెలిపారు.

Related posts