telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనుష్క బికినీ ఫోటో… సోషల్ మీడియాలో హోరెత్తుతున్న మెమెలు

Anushka-Sharma

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించింది. షారూక్ ఖాన్‌తో నటించిన “జీరో” తర్వాత ఇప్పటివరకు అనుష్క మరో సినిమాకు ఓకే చెప్పలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వివాహానికి ముందు తన గ్లామరస్ ఫోటోలను, బికినీ ఫోటోలను రెగ్యులర్‌గా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసేది. కానీ వివాహం తర్వాత అందాల ఆరబోతకు దూరమైంది. ప్రస్తుతం సినిమాలకు కూడా దూరంగా ఉంది. దీంతో అనుష్క సినిమాలకు దూరమవుతోందంటూ వార్తలు వస్తున్నాయి. భర్త కోహ్లీతో పాటు అనుష్క కూడా ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌లో ఉంది. ఈ నేపథ్యంలో అనుష్క తాజాగా వెస్టిండీస్‌ బీచ్‌లో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి “సూర్యుడు ముద్దు పెట్టుకుని ఆశీర్వదించాడు” అంటూ బికినీ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోపై చాలా మంది స్పందించారు. కోహ్లీ కూడా ఈ ఫోటోకు కామెంట్‌గా హృదయం, లవ్‌ స్ట్రక్‌ ఎమోజీలను పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆరెంజ్ మరియు వైట్ కలర్‌లో చారల బికినీలో బీచ్ దగ్గర కూర్చున్న అనుష్క చాలా బాగుందంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. మరికొందరు నెటిజన్లు మాత్రం వీఎల్‌సీ మీడియా ప్లేయర్ సింబల్‌తో అనుష్క బికినీని పోల్చుతూ మెమెలు పోస్ట్ చేస్తూ హోరెత్తిస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్‌గా ఉన్నపుడు, ఎక్స్ అయినపుడు అంటూ.. వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ అనుష్క అంటూ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుష్క ఫోటోతో పాటు, మెమెలు సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతున్నాయి.

Related posts