telugu navyamedia
సినిమా వార్తలు

వైరల్ ఫోటో : అనుష్కను పోలిన ఫారిన్ అమ్మాయి

anushka-sharma

మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే నానుడి ఎప్పటి నుంచో ఉంది. అంతేకాకుండా అప్పుడప్పుడు సెలెబ్రిటీలను పోలిన వ్యక్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నారు. నిజ జీవితంలో ఇలాంటి సంఘటనల్ని మనం అరుదుగా చూస్తుంటాము. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మలాగే ఉన్న మరో అమ్మాయిని కనుగొన్నారు నెటిజన్లు. ఆమె ఎవరోకాదు అమెరికాకు చెందిన స్టార్ సింగర్ జూలియా మైఖేల్ ఇటీవల తన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అందులో జూలియా, అనుష్క శర్మలా కన్పిస్తోంది. దీంతో ఇద్దరూ చూడడానికి ఒకేలా ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నెటిజన్లు అనుష్క శర్మను ట్యాగ్ చేస్తూ ఆ ఫోటోను షేర్ చేస్తున్నారు. అనుష్క, జూలియా పక్కపక్కనే ఉంటే విరాట్ కూడా కనిపెట్టలేడు అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

Aus makin my hair extra floofy

A post shared by Julia Michaels (@juliamichaels) on

Related posts