telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ సినిమాకు అనుష్క ‘నో’ చెప్పిందా ?

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న `ఆచార్య` సినిమాను హీరోయిన్ సమస్య వెంటాడుతోంది. ఎన్నో చర్చల అనంతరం ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశారు. అయితే సృజనాత్మక విభేదాలు అనే కారణం చెప్పి `ఆచార్య` నుంచి త్రిష అర్ధంతరంగా తప్పుకుంది. దీంతో హీరోయిన్ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. త్రిష తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి అనుష్కను తీసుకోవాలనుకున్నారు. `నిశ్శబ్దం`తో త్వరలో సందడి చేయనున్న అనుష్క అయితే చిరంజీవి పక్కన సరిపోతుందనుకున్నారు. అయితే డేట్లు అడ్జెస్ట్ కాకపోవడం వల్ల అనుష్క కూడా `ఆచార్య`కు `నో` చెప్పేసిందట. దీంతో చిరంజీవి పక్కన `ఖైదీ నెంబర్ 150`లో నటించిన కాజల్‌నే హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఆమె అంగీకరించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

Related posts