telugu navyamedia
telugu cinema news

“బిగ్ బాస్-3” హోస్ట్ గా అనుష్క ?

Anushka

“బిగ్ బాస్-3″కి సన్నాహాలను “స్టార్ మా” వారు మొదలు పెట్టేసినట్టుగా తెలుస్తోంది. “బిగ్ బాస్-1″ను హోస్ట్ గా ఎన్టీఆర్ రక్తి కట్టించారు. దానితో ఎక్కువ మొత్తం పారితోషికాన్ని ఆఫర్ చేసి, ‘బిగ్ బాస్ 3’కి కూడా ఆయననే తీసుకోవడానికి నిర్వాహకులు ప్రయత్నించారు. అయితే రాజమౌళి సినిమా కోసం వరుసగా డేట్స్ ఇచ్చేసిన కారణంగా ఎన్టీఆర్ ఈ ఆఫర్ ను తిరస్కరించవలసి వచ్చింది. ఇక ఆ తరువాత ఈ జాబితాలో చిరంజీవి, నాగార్జున పేర్లు కూడా విన్పించాయి. ఇప్పుడు “బిగ్ బాస్-3″కి వ్యాఖ్యాతగా మరో సౌత్ స్టార్ హీరోయిన్ పేరు విన్పిస్తోంది. మూడో సీజన్‌కి హోస్ట్‌గా మేల్ కాకుండా ఫీమేల్ అయితే బాగుంటుంద‌ని వారు భావిస్తున్నార‌ట‌. ఈ మేర‌కు హీరోల‌తో స‌మానంగా ఇండ‌స్ట్రీలో దూసుకెళుతున్న అనుష్క‌కి బిగ్ బాస్ -3 హోస్ట్ బాధ్యతలను అప్ప‌గిస్తార‌ని అంటున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. అనుష్క త్వ‌ర‌లో హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో “సైలెన్స్” అనే చిత్రం చేయ‌నున్న విషయం తెలిసిందే. మాధ‌వ‌న్, కిల్ బుల్ ఫేం మేఖేల్ మ్యాడ‌స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-1 2017 జూలై 16న ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా 70 రోజుల పాటు 14 మంది సెలబ్రిటీలతో సంద‌డిగా సాగింది. గ‌తంలో ఎన్న‌డు లేనంత రేటింగ్స్ ఈ కార్య‌క్ర‌మం రాబ‌ట్టింది. ఈ సీజ‌న్‌లో శివ‌బాలాజీ విజేత‌గా నిలిచారు. ఇక రెండో సీజ‌న్ 2018 జూన్ 10న సీజ‌న్-2 స్టార్ట్ చేశారు. నాని హోస్ట్‌గా దాదాపు 113 రోజుల పాటు 18 మంది సెల‌బ్రిటీల‌తో సాగింది. ఈ సీజ‌న్‌లో కౌశ‌ల్ విజేత‌గా నిలిచాడు.

Related posts

కార్తీ, రష్మిక చిత్రం టైటిల్ ఇదే

vimala p

మెగాస్టార్ చిన్నల్లుడికి వేధింపులు… సైబర్ నేరగాళ్ళను పట్టుకున్న పోలీసులు

vimala p

బిగ్ బాస్-3లో “గే” సెలబ్రిటీ

ashok