telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నా గురించే ఎందుకిలా… ఇకనైనా ఆపండి” అనుష్క ఫైర్

Anushka

దక్షిణాదిన మోస్ట్ బ్యాచులర్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. 38 సంవత్సరాలున్న ఈ అమ్మడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. త్వరలో నిశ్శబ్దం అనే చిత్రంతో అనుష్క ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. కొంతకాలంగా అనుష్క పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. ఇదివరకు హీరో ప్రభాస్‌తో అనుష్క త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందని గతంలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఇద్దరూ ఖండించారు. తాజాగా ఓ క్రికెటర్‌తో అనుష్కకు పెళ్లి నిశ్చయమైందని, త్వరలోనే పెళ్లి అని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా అనుష్క ఆగ్రహం వ్యక్తం చేసింది. “నా గురించే ఇలాంటి వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదు. మా పేరెంట్స్ ఎవరిని పెళ్లి చేసుకోమంటే అతడినే నేను పెళ్లి చేసుకుంటా. ఇకనైనా అసత్య ప్రచారం ఆపండి” అనుష్క చెప్పింది. కాగా, మహాశివరాత్రి సందర్భంగా శివలింగానికి అభిషేకం చేస్తున్న అనుష్క ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. `భాగమతి` తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన అనుష్క త్వరలో `నిశ్శబ్దం` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది.

Related posts