నటి పాయల్ ఘోష్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారం చేయబోయాడని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శక, నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు పలువురు బాలీవుడ్ నటీనటులు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే సినిమాలో అవకాశం కోసం ఆయన్నే ఒక నటి సెక్సువల్ ఫేవర్స్‌ను సూచించిందట. ఈ విషయాన్ని అనురాగ్ కశ్యప్ మాజీ అసిస్టెంట్ జయదీప్ శంకర్ వెల్లడించారు. ఈ మేరకు తాజాగా ట్వీట్ చేశారు. “ఈ స్టోరీని గుర్తుచేసుకోవడానికి ఇదే సరైన సమయం. 2004లో నేను అనురాగ్ కశ్యప్‌కు అసిస్టెంట్‌గా పనిచేశాను. ‘గులాల్’ సినిమాలో రెండో హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయం అది. చాలా మంది నటీమణులను పరిశీలించాను. ఈ సినిమాలో ఎలాగైనా నటించాలని బలమైన కోరికతో ఉన్న ఓ యువ నటి అనురాగ్‌ను కలవాలని పట్టుబట్టింది. ఆయన కోసం వెయిట్ చేసింది. నెరేషన్ పూర్తయిన తరవాత ఆమెను కలవడానికి అనురాగ్ అంగీకరించారు. ఆ పాత్రను దక్కించుకోవడానికి ‘కాస్టింగ్ కౌచ్’ ఒక్కటే మార్గమని ఆ యువ నటి భావించినట్టుంది. ఆమె స్వయంగా కొన్ని ‘ఫేవర్స్’ను సూచించింది. అయితే ఆమె ఆఫర్‌ను అనురాగ్ సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆమె మెల్లగా తన చీర పైటకొంగును జారవేయడం మొదలుపెట్టింది. ఇలా కొన్నిసార్లు చేయడంతో అనురాగ్ వెంటనే పైకిలేచి దయచేసి ఇంకోసారి అలా చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. నా సినిమాలో పాత్రకు నువ్వు సరిగ్గా సరిపోతావు అనుకుంటే నేనే అవకాశం ఇస్తాను.. నువ్వు ఏమీ చేయాల్సిన అవసరంలేదు’’ అని ఆమెతో అనురాగ్ చెప్పినట్టు జయదీప్ గుర్తుచేసుకున్నారు. “నేను ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడం లేదు. ఆ అమ్మాయి మాదిరిగానే చాలా మంది ఇండస్ట్రీకి వస్తున్నారు. సినిమాలో అవకాశం రావాలంటే ఇలాగే చేయాలని నమ్ముతున్నారు. మిగిలిన రంగాల్లో కూడా ఈ విధంగా జరగొచ్చేమో. కానీ అనురాగ్‌తో పనిచేసినప్పుడు, ముఖ్యంగా నటీనటుల ఎంపిక జరిగినప్పుడు నేను ఎప్పుడూ గమనించింది ఒక్కటే.. మహిళల పట్ల ఆయనకున్న గౌరవం” అని ట్వీట్లను ముగించారు జయదీప్.
This is the right time to recount this story. I was an assistant with @anuragkashyap72 in 2004. I was looking into secondary casting for ‘Gulaal’ and was meeting many actors. A young actress, who really wanted a part in the film insisted she wanted to meet Anurag.
Thread 👇— Jaydeep Sarkar (@sarkarjaydeep) September 20, 2020