telugu navyamedia
news telugu cinema news

నిఖిల్ తో వరుస సినిమాల్లో అనుపమ…

anupama

నిఖిల్ సిద్దార్ధ్ కు టాలీవుడ్ హీరోల్లో ప్రత్యేక స్థానం ఉంది. హ్యాపీడేస్ తో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సోలో హీరోగా చాలా సినిమాల్లో నటించినా స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాలు నిఖిల్ ను టాలీవుడ్ లో నిలబెట్టాయి. ఆ తర్వాత కిరాక్ పార్టీలో నటించిన నిఖిల్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో తనకు అద్భుతమైన హిట్ అందించిన కార్తికేయ కు సీక్వెల్ గా ‘కార్తికేయ2′ సినిమా చేస్తున్నాడు. కార్తికేయ సినిమా సూపర్ హిట్ కారణంగా రాబోతున్న ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇందులో కూడా థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు చందు మొండేటి రూపొందించేందుకు కథను సిద్ధం చేసాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాల్లో మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో పాటు నిఖిల్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ’18 పేజెస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే ఇందులో కూడా నిఖిల్ కు జంటగా అనుపమనే నటిస్తుందని తెలుస్తుంది. 

Related posts

పేద ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ : ఈటల

Vasishta Reddy

అమరావతి రైతులు రోడ్డెక్కడానికి చంద్రబాబే కారణం: మంత్రి కన్నబాబు

vimala p

ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి.. గ్రామ వాలంటీర్లకు బొత్స సూచన

vimala p