telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

పీజీ సెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఒంగోలు యూని వర్సిటీల్లో, అనుబంధ కళాశాలల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రవేశాలకు నిర్వహించిన అర్హత పరీక్షల పీజీ సెట్‌ -2019 ఫలితాలను రెక్టార్‌ ఆచార్య జాన్‌పాల్‌ శుక్ర వారం విడుదల చేశారు. పరీక్షలకు 7,681 మంది హాజరు కాగా 6,990 మంది ర్యాం కులు పొందారని పేర్కొన్నారు. ఎంపీఈడీ విద్యార్థులకు ర్యాంకులు ప్రక టించలేదని, వారు మెరిట్‌ సర్టిఫికెట్లు 15 రోజుల్లోగా సమర్పిస్తే ర్యాంకులు ప్రకటి స్తామన్నారు. ఈనెల చివరి వారంలోగా కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు.

ర్యాంకు కార్డు, హాల్‌ టికెట్‌, దరఖాస్తులు, డిగ్రీ ప్రొవిజనల్‌, మూడేళ్ల మార్కుల జాబితాలు, టీసీ, స్టడీ, ఇంటర్మీడియట్‌, పదో తరగతి సర్టిఫికెట్లతో పాటు మీసేవా కేంద్రాల ద్వారా ఈ ఏడాది జారీచేసిన నివాస, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అభ్యర్థులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌లో గానీ, మొబైల్‌ నంబర్లు 9440258822, 8125111998లో సంప్రదించాలని కోరారు.

Related posts