telugu navyamedia
సినిమా వార్తలు

“ఇస్మార్ట్ శంకర్”కు హీరోయిన్ దొరికిందా ?

Ram-Pothineni

రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న “ఇస్మార్ట్ శంకర్” సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఆరోసారి వీళ్ళిద్దరూ కలిసి పని చేయబోతున్నారు. గతంలో పూరీ జగన్నాథ్, మణిశర్మ కలిసి పని చేసిన ఐదు సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఈ ఇద్దరూ చివరగా “టెంపర్” సినిమాకు కలిసి పనిచేశారు. ఆ చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు మణిశర్మ. టెంపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రామ్ హీరోగా నటిస్తున్న “ఇస్మార్ట్ శంకర్” సినిమాకు సంగీతం అందిస్తున్నారు మణిశర్మ. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇదే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈరోజే పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి మొదలు కానుంది. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థలపై దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో రామ్ సరసన కొత్త హీరోయిన్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా ఎంపిక చేసుకోబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. “అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, శైలజా రెడ్డి అల్లుడు” లాంటి భారీ చిత్రాల్లో నటించిన అను ఇమ్మానుయేల్ కు ఒక్కచిత్రం కూడా హిట్ ఇవ్వలేదు. తొలిసారిగా రామ్ జోడీ కడుతోన్న ఈ బ్యూటీకి ఈ సినిమాతోనైనా హిట్ లభిస్తుందేమో చూడాలి.

Related posts