• Home
  • Trending Today
  • నాలుగో తరగతిలోనే ఫస్ట్ లవ్… ఇప్పుడు కూడా… పవన్ హీరోయిన్
Trending Today సినిమా వార్తలు

నాలుగో తరగతిలోనే ఫస్ట్ లవ్… ఇప్పుడు కూడా… పవన్ హీరోయిన్

anu-emmanuel

నాని నటించిన “మజ్ను” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా ముద్దుగుమ్మ అను ఇమ్మానుయేల్. ఆ తరువాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య వంటి చిత్రాల్లో అగ్ర హీరోల సరసన వరుస సినిమాల్లో నటించింది. తాజాగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించగా రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది. సెప్టెంబర్ 13వ తేదీన విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ రాబడుతో విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మీడియాతో తన ఇష్టాయిష్టాల గురించి చెప్పుకొచ్చింది అను.

చిన్నప్పటి నుంచే తనకు నటన అంటే ఇష్టమని, ఎలాంటి ప్రయత్నం చేయకుండానే పన్నెండేళ్ల వయసులో మొదటిసారి నటించే అవాకాశం వచ్చిందని, ఆ తర్వాత చదువు కోసం అమెరికా వెళ్ళటం, డిగ్రీ చేస్తున్న సమయంలో మళయాళ సినిమాలో నటించే అవకాశం రావటం ఒకదాని వెనుక ఒకటి అన్నీ చకచకా జరిగిపోయాయని తెలిపింది. నాన్నంటే భయమని, అందుకే చిన్నతనంలో పెద్దగా అల్లరి చేయలేదని చెప్పింది. తాను నాలుగో తరగతి చదువుతున్న సమయంలోనే ఫస్ట్ క్రష్ ఏర్పడిందని, అది ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుందని చెప్పుకొచ్చింది. ప్రేమంటే రెండు మనసుల కలయిక అని, తన ఓటు ప్రేమ పెళ్లికే అని అంటూ తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాల్ని బయటపెట్టింది అను.

Related posts

18 రోజుల యుద్ధం, లక్షల శవాలు… “రథం” ట్రైలర్

vimala t

'మహానటి' ఆడియో…?

admin

శర్వానంద్  "పడిపడి లేచే మనసు "

admin

Leave a Comment