telugu navyamedia
telugu cinema news

“అంతరిక్షం” ట్రైలర్… ముహూర్తం ఖరారు

Anthariksham

డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం “అంతరిక్షం : 9000 కేఎంపిహెచ్”. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా ఈ స్పేస్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన ఓ పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేసుకుంది చిత్రబృందం. ఈనెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. “అంతరిక్షం” ట్రైలర్ కోసం సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్లో ఖచ్చితంగా ఒక మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related posts

అగ్ర నటులతో .. చేయాలనుంది .. : ఈషారెబ్బా

vimala p

విజయవంతంగా యువతను ఆకట్టుకుంటున్న  ‘4 లెటర్స్’ – దర్శకుడు ఆర్.రఘురాజ్

vimala p

లవ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా ‘యురేక’..ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల..!!

vimala p