telugu navyamedia
రాజకీయ

యాగాలతో బిజీగా ఉన్న.. తెలంగాణ ముఖ్యమంత్రి…కేంద్రంలో పాగాకోసమేనా..

KCR Fire to Congress MLA Gandra

కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం కొంత కాలం మాత్రమే వివిధ బాధ్యతలమీద ప్రజలతో ఉన్నారు. మళ్ళీ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. అక్కడ రకరకాల యాగాలు వంటివి నిర్వహిస్తూ, బిజీగా ఉండిపోయారు. మొదటి నుండి కేసీఆర్ కు ఇటువంటి కార్యక్రమాలు చేయడం మాములే అయినప్పటికీ, ఈసారి కేంద్రంలో పాగావేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కావున, దానికి తగ్గట్టే యాగాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మూడేళ్ల క్రితం ఆయుత చండీయాగం, గత సంవత్సరం రాజశ్యామల యాగాలను చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ సారి మహారుద్ర సహిత చండీ మహాయాగాన్ని నిర్వహించాలని తలపెట్టారు. ఈ నెల 21 నుంచి 25 వరకూ శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఎరవల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో ఈ యాగం జరిపించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయుత చండీయాగం తరహాలోనే ఈ యాగం కూడా సాగుతుందని తెలుస్తోంది.

ఇప్పటికే యాగశాల, రుత్విక్కులు బస చేసేందుకు తాత్కాలిక ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 5 రోజుల పాటు యాగం జరుగనుండగా, 200 మంది రుత్వికులు పాల్గొంటారు. శృంగేరీ పీఠ పండితులు శశాంక శర్మ, గోపీకృష్ణ శర్మలు యాగంపై ఇప్పటికే కేసీఆర్ తో చర్చించారు. గత నెలలో కేసీఆర్, శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్ధ, విశాఖ పీఠాధిపతి శారదా స్వరూపానదేంద్ర స్వామిలను కలుసుకుని యాగంపై ఆశీస్సులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ యాగాన్ని చూసేందుకు సందర్శకులను అనుమతించాలా? వద్దా? అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

Related posts