telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

మరో విద్యార్థి .. ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకోని..

Gun

ఇటీవల ఇంటర్ ఫలితాలలో తారుమారు జరగటంతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా మరో విద్యార్థి జేఈఈ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించనేమోననే బెంగతో మనస్తాపానికి గురై తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. నేరేడ్‌మెట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాకు చెందిన మహరుద్దీన్‌, సరోజ్‌బాల దంపతులు రామకృష్ణాపురం బాలాజీ కాలనీలో ఉంటున్నారు. విశ్రాంత సైనికోద్యోగి అయిన మహరుద్దీన్‌ ప్రస్తుతం క్యాష్‌ మేనేజిమెంట్‌ సిస్టంలో సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు ఆసిఫ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. రెండో కుమారుడు సమీర్‌ ఒడిశాలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడో కుమారుడు సాహిల్‌ (19).

బొల్లారంలోని కేంద్రీయ విద్యాలయలో చదివిన సాహిల్‌ 2018లో ప్లస్‌టూ పరీక్షల్లో కొన్నింటిలో తప్పాడు. ఈ ఏడాది తిరిగి పరీక్షలు రాశాడు. ఏప్రిల్‌ 8న జరిగిన జేఈఈ మెయిన్స్‌ రాసిన సాహిల్‌… ఆ పరీక్షలో తాను అర్హత సాధించనేమోననే ఆందోళన చెందేవాడు. ఇలా మనస్తాపానికి గురైన సాహిల్‌ పడకగదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కొడుకు నిద్రపోతున్నాడేమోనని తల్లిదండ్రులు అనుకున్నారు. రాత్రి 2 గంటలకు తండ్రికి చెందిన డబుల్‌ బ్యారెల్‌ తుపాకీతో నుదుటిపై కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీ పేలిన శబ్దం రావడంతో.. తలుపులు తెరిచి చూసేసరికి సాహిల్‌ మృతిచెంది ఉండటంతో వారు కుప్పకూలిపోయారు. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీసీ శివకుమార్‌ ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఆత్మహత్యలు విద్యార్థుల మానసిక దౌర్బల్యాన్ని స్పష్టంగా చెపుతున్నాయి.. ఇదే అదునుగా కుటిల రాజకీయ నాయకులూ వాళ్ళ ఇష్టానికి చెలరేగిపోతున్నారు. దేశానికి వెన్నుముకగా ఉండాల్సిన యువత ఇలా .. మానసికంగా బలహీనంగా ఉండటం రాజకీయ నాయకులకు బాగా కలిసివచ్చే అంశం. కానీ, దేశానికి ఇదే చాలా ప్రమాదకరమైన అంశం. దీనిపై చర్చలు జరిగి, వాటి ఆచరణ కూడా జరిగితీరాలి. లేదంటే, ఈ దేశం జీవితాంతం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇలా రేపటి తారలు లేకుండా పోవటంతో, రేపు అనేది లేని దేశంగా కూడా ఇది తీవ్రవాదులకు చక్కగా ఉపయోగపడుతుంది. బహుశా.. చాపకింద నీరులా.. అదే జరుగుతున్నట్టుగా ఉందని, కాస్త నిచ్చితంగా పరిశీలిస్తే, తేలిపోతుంది!

Related posts